![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సకుటుంబ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు..దానికి సంబందించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షో మొత్తంలో శ్రీముఖి పెళ్లి కాన్సెప్ట్ తోనే లింక్ ఐనట్టు తెలుస్తోంది. శ్రీముఖికి వాళ్ళ నానమ్మ ఈ షోకి వచ్చింది. ఇక శ్రీముఖి చిత్రంతో ఒక బోర్డుని స్టేజి మీద ఏర్పాటు చేసారు. ఇక హరి శ్రీముఖికి కావాల్సిన పెళ్లికొడుకులో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో, మీకు ఎలాంటి మనవడు కావాలో చెప్తే మేం రాస్తాం అంటూ నానమ్మని అడిగాడు. ఆమె చాలా కండిషన్స్ చెప్పింది. "బుద్ది, గుణం బాగుండాలి" అని చెప్పింది. "సంపాదన ఎంత ఉండాలి" అని అవినాష్ అడిగాడు. "శ్రీముఖి కంటే ఎక్కువనే ఉండాలి" అని చెప్పింది.
"శ్రీముఖి కన్నా ఎక్కువ సంపాదించేవాళ్ళు లేరమ్మా" అన్నాడు హరి. "ఆమె అడిగింది పెట్టాలి, ఆమెకు టమాటో ముక్కాలా కూర, రోటి పచ్చడి, చిక్కుడుకాయ, మామిడి పచ్చడి" అనేసరికి "ఎందుకు కర్రీ పాయింట్ పెట్టుకుంటుందా" అంటూ అవినాష్ అడిగాడు. "అంటే శ్రీముఖి అడిగిందల్లా వండి పెట్టాలంటారు అంతేనా" అని అడిగి బోర్డు మీద "వంట మనిషి కావాలి" అని రాసాడు. "ఒరేయ్ వంట మనిషి కాదురా వంట వచ్చిన మనిషి కావాలి" అని రాయాలి అని సరి చేసింది శ్రీముఖి. "సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావాలా బయట వాళ్ళు కావాలా" అని అవినాష్ అడిగాడు. "ఇప్పుడు హీరోలందరికీ పెళ్లిళ్లయిపోయాయి కదా" అని నానమ్మ అంటే "అవును హీరో రామ్ చరణ్, మహేష్ బాబుకు ఐపోయింది" అని శ్రీముఖి అనేసరికి హరి, అవినాష్ వామ్మో అంటూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. "నానమ్మ ఈ గ్యాప్ లో బోర్డు మీద ఇంకో పాయింట్ రాసాడు. ఓవరాల్ గా అవినాష్ లా ఉండాలి" అని రాసేసరికి "నీలాంటోళ్ళు అసలు వద్దు" అని అవినాష్ ముఖమ్మీదే చెప్పేసింది నానమ్మ. దాంతో శ్రీముఖి నవ్వేసింది.
![]() |
![]() |